- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
T Congress : రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కేసీఆర్ ప్లాన్? కాంగ్రెస్ సెన్సేషనల్ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ సీఎం కేసీఆర్ (EX CM KCR) పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (Telangana Congress) సంచలన ఆరోపణలు చేసింది. గురువారం ఎక్స్ వేదికగా సెన్సేషనల్ ట్వీట్ చేసింది. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కేసీఆర్ ప్లాన్ చేశారని తీవ్ర ఆరోపణలు చేసింది. అధికారులపై దాడిని కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు సమర్థిస్తున్నారని పేర్కొంది. బీఆర్ఎస్ నాయకులకు రైతులు, మహిళలు, నిరుద్యోగులు అంటూ ముసుగు వేసి, ధర్నాలు నిర్వహించి, దాడులు చేసి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు విధ్వంసకర వ్యూహాలు రచిస్తున్నారని వెల్లడించింది.
కాగా, ఇటీవల లగచర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి ఘటన తెలంగాణ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరికొందరు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ కావొచ్చని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. లగచర్ల దాడి ఘటన వెనుక కేటీఆర్ ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.