Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎయిర్ టెల్ రిపోర్టులో సంచలన విషయాలు

by Rani Yarlagadda |
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎయిర్ టెల్ రిపోర్టులో సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇప్పటి వరకూ పోలీస్ అధికారులే నిందితులుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case).. తొలిసారి రాజకీయ నేతకు నోటీసులివ్వడంతో కేసు మరో మలుపు తిరిగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు (Chirumarthi Lingaiah) రెండ్రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన పోలీసులు.. విచారణకు హాజరు కావాలని అందులో తెలిపారు. తాజాగా ఈ కేసులో ఎయిర్ టెల్ (Airtel) టెలికాం సంస్థ ఇచ్చిన రిపోర్టు మరో సంచలనం రేపింది. మునుగోడు ఉపఎన్నిక సమయంలో చిరుమర్తి లింగయ్య రెండు ఫోన్ నంబర్లను ట్యాప్ చేయించినట్లు ఆ రిపోర్టులో వెల్లడైంది.

ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల ఫోన్ నంబర్లను ట్యాప్ చేయాలని లింగయ్య.. తిరుపతన్న, భుజంగరావులకు నంబర్లు పంపినట్లు తెలిసింది. ఆ ఇద్దరు వ్యక్తు ప్రస్తుతం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) అనుచరులుగా ఉన్నారు. ఒకరు మదన్ రెడ్డి, మరొకరు రాజ్ కుమార్. వారిద్దరి ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఎయిర్ టెల్ రిపోర్టులో పేర్కొంది. ఈ వ్యవహారంలోనే చిరుమర్తి లింగయ్యను నేడు పోలీసులు విచారించనున్నారు. మరోవైపు మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ను కూడా పోలీసులు విచారణకు పిలిచారు. లింగయ్య వారిద్దరి ఫోన్లను ట్యాప్ చేయించినట్లు తేలితే.. ఏ క్షణమైనా ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed