IndiGo flight : ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. రాయ్‌పూర్‌లో అత్యవసర ల్యాండింగ్

by vinod kumar |
IndiGo flight : ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. రాయ్‌పూర్‌లో అత్యవసర ల్యాండింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానానికి(Indigo Flight) బాంబు బెదిరింపు ఎదురైంది. దీంతో ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌(Raipur)లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం బయలుదేరిన కాసేపటికే బెదిరింపు రావడంతో ల్యాండింగ్ చేశారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు బాంబు స్క్వాడ్‌ను రప్పించారు. అనంతరం భద్రతా తనిఖీల కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తీసుకెళ్లి సోదాలు చేశారు. ఘటన తర్వాత రాయ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొద్దిసేపు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానంలో 187 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం. విమానంలో ఇంకా సోదారులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, గత కొద్ది రోజులుగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు ఎదురవుతున్న విషయ తెలసిందే. అక్టోబర్‌లో 400కు పైగా విమానాలకు బాంబు వార్నింగ్స్ వచ్చాయి. అయితే అవన్నీ బూటకమని తేలింది. దీనివల్ల విమానయాన సంస్థలకు రూ.200కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు పలు కథానలు వెల్లడించాయి.

Advertisement

Next Story