నిర్లక్ష్యపు డ్రైవింగ్ జీవితాన్ని మింగేస్తుంది : రామగుండం సీపీ

by Aamani |
నిర్లక్ష్యపు డ్రైవింగ్ జీవితాన్ని మింగేస్తుంది : రామగుండం సీపీ
X

దిశ,బెల్లంపల్లి: నిర్లక్ష్యం డ్రైవింగ్ జీవితాన్ని మింగేయడం తో పాటు తమ కుటుంబాల భవిష్యత్తును లేకుండా చేస్తుందని రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని అధికారుల వద్ద డ్రైవింగ్ విధులు, జనరల్ డ్యూటీ,బీడీ టీమ్,పీఎస్ఓ విధులు నిర్వహిస్తున్న 200 మంది పోలీస్ సిబ్బందికి బెల్లంపల్లి ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం సిపి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై డ్రైవర్ కి పలు సూచనలు, సలహాలు, జాగ్రత్తలు వివరించారు. డ్రైవర్స్ కి ప్రశంస పత్రాలు అందచేశారు. సీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రైవర్స్ వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మంచి కండిషన్లో ఉంచుకోవాలని సూచించారు. సొంత వాహనంలా మంచి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించాలన్నారు.

అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ప్రజలకు పోలీసులు ఆదర్శంగా ఉండాలన్నారు. ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని వాపోయారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. సమయం దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని,పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయిలో ఉండే విధంగా డ్రైవర్లకు దిశా నిర్దేశం చేశారు.ఒక చిన్న నిర్లక్ష్యపు కారణం వల్ల ప్రమాదం సంభవించి వారి కుటుంబ భవిష్యత్తు రోడ్డు పాలవడం జరుగుతుందని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా పోలీస్ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం తధ్యమని సీపీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, బెల్లంపల్లి ఏసీబీ రవికుమార్, ఏఆర్ ఏసిపి సుందర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed