- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనంతలో సినీ తారల సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఆ ఇద్దరు హీరోయిన్స్
దిశ ప్రతినిధి,అనంతపురం:నగరంలో శుక్రవారం సినీ తారలు పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ సందడి చేశారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన వీరిని తిలకించేందుకు యువత ఆసక్తి కనబరిచింది. ఈ కార్యక్రమంలో ఆ ఇద్దరు నటీమణులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో అతిపెద్ద వస్త్ర, జ్యువెలరీ వ్యాపార సంస్థగా కొనసాగుతున్న సీఎంఆర్ షాపింగ్ మాల్ తన 36వ షో రూమ్‌ను అనంతపురం నగరంలో శుక్రవారం ప్రారంభించింది. నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్‌ను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథులుగా సునీత తనయుడు, ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ ప్రజల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. మొదటి కొనుగోలుదారుగా ఐటీసీ అనంతపురం డీలర్ గొంట్ల సుబ్బరాయుడు శెట్టి వ్యవహరించారు. సినీ తారలు పాయల్ రాజ్ ఫుత్, నభా నటేష్ తదితరులు తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం షాపింగ్ మాల్‌లోని వివిధ విభాగాలను పరిశీలించారు. సినీ నటులు ఇరువురినీ తిలకించేందుకు యువత ఎగబడ్డారు.
వారు కూడా తమ అభిమానులతో సెల్ఫీలు దిగి ఉత్సాహపరిచారు. తమ సంస్థను సుమారు నాలుగు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని సంస్థ ఫౌండర్, చైర్మన్ మావూరి వెంకటరమణ పేర్కొన్నారు. అనంతపురం నగరంలో తమ 36వ షోరూంను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సీఎంఆర్ లో షాపింగ్ అంటే ప్రపంచ స్థాయి అనుభూతి కలుగుతుందన్నారు. అన్ని రకాల వేడుకలకు తమ వద్ద వస్త్రాలు జ్యువెలరీ సరసమైన ధరలకే లభిస్తాయన్నారు. సీఎంఆర్ ఎండీ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ సీఎంఆర్ అంటే ది వన్ స్టాప్ షాప్ అని అభివర్ణించారు. కుటుంబ సభ్యులందరికీ నచ్చేలా తమ వద్ద వివిధ రకాల డిజైన్లు సరసమైన ధరల్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ అనంతపురంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభించడం హర్షదాయకమన్నారు. దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు.