- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాసనసభను సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధులు
దిశ, తెలంగాణ బ్యూరో: ఆస్ట్రేలియా దేశానికి చెందిన ప్రజా ప్రతినిధుల బృందం శుక్రవారం తెలంగాణ శాసనసభ కార్యాలయాన్ని సందర్శించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. ఆస్ట్రేలియా ప్రజా ప్రతినిధుల బృందానికి తెలంగాణ శాసన సభ, శాసన మండలి సభ మందిరాలను చూపించి, నిర్వహణ తీరును వివరించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా దేశానికి చెందిన మంత్రులు రిచర్డ్ రీయర్డాన్ , బ్రాండ్ బట్టిన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర లేజిస్లేచర్ సభలను గొప్పగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. లేజిస్లేచర్ కి సంబంధించిన చాలా విషయాలను తెలుసుకున్నమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ కార్యాలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ, లేజిస్లేచర్ సెక్రెటరీ డాక్టర్ నరసింహాచార్యులు ఉన్నారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందాన్ని సన్మానించారు.