ప్రభావిత గ్రామాలను అభివృద్ధి చేస్తాం : రామగుండం ఎమ్మెల్యే

by Aamani |
ప్రభావిత గ్రామాలను అభివృద్ధి చేస్తాం : రామగుండం ఎమ్మెల్యే
X

దిశ, గోదావరిఖని టౌన్: ఆర్ఎఫ్సీఎల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. శుక్రవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ ఎఫ్ సి ఎల్ అధికారులు పరిసర ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్ నిర్లక్ష్యం కారణంగా జల, వాయు, శబ్ద కాలుష్యంతో పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తమ పరిధిలోకి వచ్చే డివిజన్లు ,గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు నిర్వహణ , సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆర్ ఎఫ్ సి ఎల్ అధికారులను ఆదేశించారు. నగరంలో అస్తవ్యస్తంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు సరి చేయాలని ఆదేశించారు. ఫుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించాలని అధికారులను కోరారు. వీధి వ్యాపారులను గుర్తించి వారి వ్యాపారం సజావుగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పచ్చదనం పెంపొందించి ఎల్ ఇ డి లైట్లు ఏర్పాటు చేయాలన్నారు.

ఐలాండ్ లు ఏర్పాటు చేసి నగర సుందరీకరణ పనులు చేపట్టాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. నగరంలో రాముని గుండాలు, జనగామ శివాలయం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు , ఎల్లంపల్లి, సుందిళ్ల రిజర్వాయర్లు, ఉపరితల,భూగర్భ బొగ్గు గనులు,గోదావరి నది ఉన్నందున అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ఒక బృహత్ ప్రణాళిక రూపొందించాలని అన్నారు. ఐ డి ఎస్ ఎం టి షాపింగ్ కాంప్లెక్స్ ఆధునీకరించి ఉపయోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.నగరంలోని టి యు ఎఫ్ఐడీ సీ , డీఎంఎఫ్టీ ,ఎస్డీఎఫ్ తదితర పథకాలతో చేపట్టిన పనుల పురోగతి సమీక్షించారు. ఈ సమావేశంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, అదనపు కలెక్టర్, కమీషనర్ (ఎఫ్ఎసి) అరుణ శ్రీ, ఆర్ ఎఫ్ సి ఎల్ జనరల్ మేనేజర్ ప్రదీప్ వర్షె, సింగరేణి ఆర్ జి వన్ జిఎం లలిత్ కుమార్, నగర పాలక సంస్థ ఎస్ ఈ శివానంద్, సెక్రటరీ రాజు, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్ ,ముస్తఫా, నాయకులు పాత పెల్లి ఎల్లయ్య ,పెద్దెల్లి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed