- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేయాలి : ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
దిశ,చింతలమానేపల్లి : రైతాంగానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ నేత డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చింతలమానేపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా సేకరించిన భూములకు ఇంకా రైతులకు నష్టపరిహారం అందలేదని, తక్షణమే పరిహారం చెల్లించాలని అన్నారు.
సిర్పూర్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న తుమ్మిడిహట్టి,సాండ్ గాం, రణవెల్లి,కోర్సిని,గూడెం, హుడికిలి, లోనవెల్లి,సూర్జాపూర్,జంబుగ ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు అందించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న అడ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసి 10 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. చెరువుల నుంచి పంట పొలాలకు నీరుపారే కాలువలు పూడుకుపోయి,తూము ద్వారం గేట్లు మరమ్మతులకు చేయాలన్నారు. లేనిపక్షంలో రైతులకు మద్దతుగా త్వరలోనే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలి
కాగజ్ నగర్ మండలం అంకుషాపూర్ లో అధికార కాంగ్రెస్ నాయకులు చట్టవిరుద్ధంగా నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పులుల అభయారణ్యానికి కేవలం 60 మీటర్ల దూరంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ,నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ పూర్తయితే పచ్చని పల్లెలు కాలుష్యం నుంచి బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టవద్దని ప్రవేటు యాజమాన్యానికి అటవీ అధికారులు నోటీసులు ఇచ్చినా ఖాతరు చేయడం లేదంటే దీని వెనుక అధికార కాంగ్రెస్ బడా నేతల హస్తం ఉందని ఆరోపించారు.అటవీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన యాజమాన్యం స్పందించడం లేదంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని అనుమానం వ్యక్తం చేశారు.
కర్జవెల్లి-గూడెం బీటీ రోడ్డు నిర్మించాలి
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని కర్జవెల్లి-గూడెం మార్గానికి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గూడెం,చిత్తమాలో పర్యటించారు. కర్జవెల్లి-గూడెం రోడ్డు వర్షాలకు దెబ్బతిని నరక కూపంలా మారిందని అన్నారు. గూడెం నుంచి సిర్పూర్,కాగజ్ నగర్ తోపాటు ఇతర ప్రాంతాల వెళ్లాలంటే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, విద్యార్థుల బాధలు వర్ణనాతీతమని పేర్కొన్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా,ఎమ్మెల్యేలు మారుతున్నా గూడెం రోడ్డును పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆయన విచారం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప హయంలో కోట్ల రూపాయలు గూడెం బ్రిడ్జి కాంట్రాక్టు తన అనుచరులకు దక్కించుకున్నారు కానీ, గూడెం బీటీ రోడ్డును నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.
కాంగ్రెస్ గుండాగిరిని సహించం
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న గుండా గిరిని సహించమని అన్నారు.చింతలమానేపల్లి కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అప్రోచ్ రోడ్డు లేక వర్షాకాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికార పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్సీ దండే విఠల్ చొరవతీసుకొని కేజీబీవీ పాఠశాలకు రోడ్డు నేర్పించేలా ఎందుకు చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. తెలంగాణలో ఆంధ్ర గుండాగిరి నడవదన్న ఆయన తెలంగాణ ఉద్యమకారులు ఏకమై మళ్లీ బీఆర్ ఎస్ అధికారంలోకి తీసుకొచ్చేలా పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ నాయకులు గోమసే లాహంచు,నీలగౌడ్,రామ్ ప్రసాద్, అవుల రాజు కుమార్ యాదవ్, నవీన్,నాగపూరె బండు పటేల్, దుర్గం వెంకటేష్, చారి గోవింద్ రావు తదితరులు పాల్గొన్నారు.