Adilabad floods : భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తం.. ఫోటో ఫీచర్

by Sumithra |   ( Updated:2023-07-27 11:03:41.0  )
Adilabad floods : భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తం.. ఫోటో ఫీచర్
X

దిశ, నెట్ వర్క్ : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలం అవుతుంది. జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు, కుంటలు, నదులు ఎక్కడికక్కడ పొంగిపొర్లుతున్నాయి. దీంతో భారీ వృక్షాలు, కరెంటు స్థంబాలు నేలమట్టం అవుతున్నాయి. రోడ్లపై వరదనీరు భారీగా చేరడంతో రాకపోకలు స్థంబించిపోయాయి.

వాగులకు వరద పోటెత్తడంతో కొన్ని గ్రామాలు జలదిగ్బంధనంలో ఉండిపోయాయి. అలాగే భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులయ్యారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఇండ్లు మునిగిపోయి తినడానికి తిండి, తాగడానికి నీరు దొరకని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఈ వరద సృష్టిస్తోన్న భీబత్స దృష్యాలను 'దిశ ' మీ ముందు ఉంచుతోంది.





































Advertisement

Next Story