బెజ్జూర్ లో పీడీఎస్ బియ్యం పట్టివేత..

by Sumithra |
బెజ్జూర్ లో పీడీఎస్ బియ్యం పట్టివేత..
X

దిశ, బెజ్జూర్ : బెజ్జూర్ మండలం కృష్ణపల్లి పెద్దవాగు సమీపంలో 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని శుక్రవారం రాత్రి పట్టుకున్నట్లు బెజ్జూర్ ఎస్సై కే.ప్రవీణ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బెజ్జూరు మండలం నుండి మహారాష్ట్రకు బులోరా వాహనంలో 15 క్వింటాళ్ల పీడీఎస్ అక్రమంగా తరలిస్తుండగా, పక్కా సమాచారం మేరకు పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. పీడీఎస్ బియ్యం తరలిస్తున్న ఎండీ నౌషాద్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed