- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TGPSC: గ్రూప్ -2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ చైర్మన్ కీలక అప్ డేట్
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో గ్రూప్ -2 సర్వీసుల పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం (Burra Venkatesham) చెప్పారు. రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తున్నామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై నమ్మకం, అభ్యర్థులు వారి మెరిట్ పై నమ్మకం ఉంచి పరీక్షలు రాయాలని అభ్యర్థులకు సూచించారు. టీజీపీఎస్సీ మీ తల్లి లాంటిదని ఎలాంటి అపోహలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు. ఎవరి ఓఎంఆర్ షీట్ వారికే ఉంటుందని అభ్యర్థులు తమకు కేటాయించిన ఓఎంఆర్ షీట్ ను పక్కాగా చెక్ చేసుకోవాలన్నారు. ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ తప్పనిసరి అని బయోమెట్రిక్ లేకుండా పరీక్ష రాసేందుకు వీలు లేదన్నారు. ఏదయినా పరిస్థితిలో బయోమెట్రిక్ లేకుండా పరీక్ష రాసినా అది వ్యాలీడ్ కాదని స్పష్టం చేశారు. 2022లో నోటిఫికేషన్ ఇస్తే గత వారంలో సుప్రీంకోర్టు, హైకోర్టు కేసుల నుంచి గెలిచామన్నారు. 783 పోస్టులకు పరీక్ష ఒక్కొక్కరి ఉద్యోగానికి కనీసం 70 మంది పోటీ పడుతున్నారన్నారు. గ్రూప్-2 పోస్టుల భర్తీకి గతంలో 2015 నుంచి 2019 వరకు టైం పట్టింది.ఈసారి తక్కువ సమయంలో భర్తీ చేస్తున్నాం. గ్రూప్ 2 కు పూర్తిస్థాయిలో మేము సన్నద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు, ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నాపత్రాలు స్టోరేజీ చేసేందుకు 58 కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. అభ్యర్థులకు తప్ప అందులో ఏ ప్రశ్నలు ఉన్నాయో ఎవరికీ తెలియదని చెప్పారు.
టీజీపీఎస్సీ ప్రక్షాళన కోసం ఢిల్లీకి:
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన కోసం ఈ నెల 18,19 తేదీల్లో టీజీపీఎస్సీ సభ్యులు అంతా కలిసి ఢిల్లీకి వెళ్తున్నామని బుర్ర వెంకటేశం చెప్పారు. 18న ఉదయం యూపీఎస్సీ కార్యాలయంలో గైడ్ లైన్ తీసుకుంటామని, 19న ఎస్ఎస్ సీ కమిషన్ ఆఫీస్ కు, సాయంత్రం ఎన్ టీఏ చైర్మన్ తో భేటీ అవుతామన్నారు. పారదర్శకంగా పరీక్షల నిర్వహణ కోసం అధ్యయనం చేసేందుకు ఈ పర్యటన ఉంటుందన్నారుర. జనవరి నాటికి ప్రభుత్వానికి దీనిపై నివేదిక అందజేసి తర్వాత రిక్రూట్ మెంట్ కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతామన్నారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లు తెలంగాణలో పర్యటించనున్నాయని వచ్చే జనవరిలో వారు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు. టీజీపీఎస్సీ అంటే కమిట్ మెంట్, స్పీడ్ అనేలా అభ్యర్థులకు నమ్మకం కలిగించేలా చూస్తామన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ లాంటి వాటిని 6 నుంచి 9 నెలల్లో పరీక్ష ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. సింగిల్ పరీక్ష ఉన్నవాటిని 6 నెలల్లోనే భర్తీ చేస్తామన్నారు. జనవరి నుంచి మార్చి మధ్యలో గ్రూప్-3 పరీక్ష ఫలితాలు రిలీజ్ చేస్తామన్నారు.
ఏ పుస్తకాలు చదవాలన్ని మేము చెప్పకూడదు:
టీజీపీఎస్సీ సిలబస్ మాత్రమే ఇస్తుందని ఏ పుస్తకాలు చదవాలన్నది మేము చెప్పమని బుర్ర వెంకటేశం అన్నారు. అది అభ్యర్థుల ఇష్టం. ఎందుకంటే మేము ఎలాంటి పుస్తకాలు ముద్రణ చేయడం లేదు. ఏ పుస్తకాలు చదవాలన్నది మేము చెప్పకూడదన్నారు. కొత్త నోటిఫికేషన్లను జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసి జనవరి నాటికి కొత్త నోటిఫికేషన్ పై స్పష్టత ఇస్తామన్నారు. తేదీలు క్లాష్ అయితే 5 వేలమంది రాసే పరీక్ష కోసం 5 లక్షల మంది అభ్యర్థుల జీవితాలను ఇరకాటంలో పెట్టలేమన్నారు. టీజీపీఎస్సీ చిన్న సంస్థ.. కానీ రాష్ట్రస్థాయిలో అన్ని నియామకాలు చేపట్టే సంస్థ అన్నారు. సీబీటీ పరీక్ష నిర్వహించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గ్రూప్ -2 పరీక్షను కూడా సీబీటీ విధానంలో నిర్వహించవచ్చు. కానీ 28 వేల మంది రాసేందుకు మాత్రమే అవకాశం ఉందన్నారు. దీనివల్ల పరీక్షకు 25 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. మార్చి నెలాఖరులో గ్రూప్- 2 పరీక్ష ఫలితాలు రిలీజ్ చేస్తామని వెల్లడించారు. టీజీపీఎస్సీలో కొత్తగా 80 మందిని డిప్యుటేషన్ విధానంలోతీసుకుంటున్నామన్నారు.