Vijayawada:భక్తులకు గుడ్ న్యూస్.. యాప్ లాంచ్ చేసిన మంత్రి ఆనం

by Jakkula Mamatha |   ( Updated:2024-12-14 08:41:23.0  )
Vijayawada:భక్తులకు గుడ్ న్యూస్.. యాప్ లాంచ్ చేసిన మంత్రి ఆనం
X

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడ ఇంద్రాకీలాద్రి దుర్గ అమ్మవారి దీక్షల సందర్బంగా ప్రత్యేకమైన యాప్‌ని లాంచ్ చేసినట్ల దేవాదాయ శాఖ మంత్రి(Minister of Revenue) ఆనం రామనారాయణ రెడ్డి(Anam Ramanarayana Reddy) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం ఇంద్రకీలాద్రి అమ్మవారిని(Goddess Indrakiladri) ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ దర్శించుకున్నారని తెలిపారు. ప్రభుత్వం(Government) నుంచి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం చెప్పామన్నారు. అయితే ఈ నెల 21వ తేదీ నుంచి భవానీ భక్తులు మాల విరమణ నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి వస్తున్నారని పేర్కొన్నారు. ఏటా సుమారు 5 లక్షల పైచిలుకు భక్తులు(Devotees) అమ్మవారిని దర్శించుకుంటారని మంత్రి తెలిపారు.

ఈ క్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కనకదుర్గ నగర్‌లో మూడు హోమగుండాలను ఏర్పాటు చేసి, ఇరుముడి బియ్యానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. అయితే.. ఈరోజు ఒక యాప్‌ని లాంచ్ చేసాము. ఆ యాప్ ద్వారా భవానీలు ఎంతమంది వచ్చారు. రోజుకి ఎంతమంది వస్తున్నారని ఈ యాప్ ద్వారా తెలుస్తుంది అన్నారు. భవానీలు ముందుగానే ఈ యాప్‌లో వారు ఎప్పుడు వస్తారో సమయాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ యాప్‌ని సద్వినియోగం చేసుకోవలసిందిగా భక్తులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆలయానికి నిధులు సమకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) దీనిపై మీటింగ్ ఏర్పాటు చేశారు.. త్వరలోనే ఆలయ అభివృద్ధికి నిధులు కేంద్రం నుంచి తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed