Karthika Deepam: తండ్రీ కూతుర్ల ప్రేమ చూసి.. మురిసిపోయిన దీప

by Prasanna |
Karthika Deepam: తండ్రీ కూతుర్ల ప్రేమ చూసి.. మురిసిపోయిన దీప
X

దిశ, వెబ్ డెస్క్ : కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

శౌర్యను పడుకోమని చెప్పి, దీప వంట గదిలో తన పని తాను చేసుకుంటుంది, ఇంకో వైపు కార్తీక్ కూడా ఆఫీస్ వర్క్ ఉందని చెప్పి వెళ్ళడంతో శౌర్య అలిగి .. ‘వెళ్లిపోండి.. వెళ్లిపోండి’ ఇద్దరూ వెళ్లిపోండి అంటూ సైలెంట్ అవుతుంది. దాంతో కార్తీక్ బాగా ఆలోచించి ‘దీపా కిచెన్ లో పని రేపు చేసుకో .. నేను కూడా నా పని రేపు చేసుకుంటాను అని అంటాడు. ఇక దీప, కార్తీక్.. శౌర్య ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కార్తీక్ కళ్లను నలుపుకుంటాడు. అది చూసిన కూతురు శౌర్య, దీప చీర కొంగును తీసుకుని ఆవిరి పడుతుంది.

కార్తీక్‌, దీపలకు శౌర్య స్కూల్ విషయాలు మొత్తం చెబుతుంది. దీపను కాపాడే సమయంలో .. రౌడీలు మట్టి కొట్టి వెళ్ళడంతో కార్తీక్ కళ్లు ఎర్రగా అయ్యి ఇబ్బంది పడుతూ ఉండటంతో శౌర్య ఎమోషనల్‌గా.. ‘నాన్నా నాకు మా అమ్మ ఉంది. అమ్మకు నువ్వు ఉన్నావ్.. కానీ నీకు ఎవరు లేరు.. నేను ఉంటాను.. నీకు ఏదైనా ఇబ్బంది వస్తే నేను నీకు తోడుగా ఉంటాను’ అని ప్రేమగా అంటుంది. ఆ మాటలకు కార్తీక్ ఎమోషనల్ అయి గుండెలకు హాగ్ చేసుకుంటాడు. అది చూసి దీప కూడా చాలా సంతోషపడుతుంది.

Advertisement

Next Story

Most Viewed