Konda Visveshwar Reddy: అల్లు అర్జున్ అరెస్టు వెనుక అత్యుత్సాహం: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Prasad Jukanti |   ( Updated:2024-12-14 10:07:49.0  )
Konda Visveshwar Reddy: అల్లు అర్జున్ అరెస్టు వెనుక అత్యుత్సాహం: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) విమర్శించారు. అల్లు అర్జున్ అరెస్టు (Allu Arjun arrest) వెనుక అత్యుత్సాహం కనిపిస్తోందన్నారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. ఘటనలో అల్లు అర్జున్ తప్పేమి లేదన్నారు. బెయిల్ వచ్చాక కూడా అల్లు అర్జున్ ను ఎందుకు రిలీజ్ చేయలేదని దీని వెనుక రాజకీయ ఒత్తిడి, రాజకీయ కక్ష్య ఉందేమో అనిపిస్తోందన్నారు. 90 శాతం తెలంగాణ అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తోందని అన్నారు. 6 గ్యారెంటీలు ఫెయిల్, హైడ్రాతో బుల్డోజింగ్, నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఇలా రోజు రోజుకు కాంగ్రెస్ అన్ పాపులర్ అవుతోందన్నారు.

Next Story

Most Viewed