- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Whatsapp: వినియోగదారులకు సూపర్ న్యూస్.. వాట్సాప్ వెబ్‌లో ఇకపై ఆ సమస్య ఉండదు!

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ మెటాకు (Meta) చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్ను (New Feature) వినియోగదారులకు అందించనుంది. వాట్సప్ వెబ్ (Whatsapp Web) వినియోగిస్తున్న యూజర్లకు ఇకపై యాప్‌తో పనిలేకుండా వాయిస్, వీడియో కాల్స్ చేసే సౌలభ్యాన్ని కల్పించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉండగా.. త్వరలోనే అందరికి అందుబాటులోకి రానుందని వాబీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పంచుకుంది.
కాగా, వాట్సాప్ మొబైల్ యాప్, డెస్క్‌టాప్ వెర్షన్లకు చాలా కాలం నుంచే కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే వాట్సాప్ వెబ్ యూజర్లు ఈ సదుపాయం వినియోగించాలంటే తప్పనిసరిగా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఆ సమస్య ఉండదు. యాప్‌తో పని లేకుండా నేరుగా కాల్స్ చేయొచ్చు. అంటే త్వరలో వాట్సప్ వెబ్ చాట్స్‌లోనూ ఫోన్, వీడియో కాల్ ఐకాన్‌లు కనిపించనున్నాయి. అలాగే, ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత, వాట్సాప్ వెబ్ ద్వారా తమ మొదటి కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులు తమ మైక్రోఫోన్, వెబ్ క్యామ్‌కు యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. వినియోగదారులు కుకీలు, సైట్ డేటాను క్లియర్ చేయకపోతే బ్రౌజర్లు సాధారణంగా ఈ అనుమతులను గుర్తుంచుకుంటాయి. ప్రత్యామ్నాయంగా, వినియోగదారులు సైట్ సందర్శించిన ప్రతిసారీ యాక్సెస్‌ను ఆమోదించే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.