- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Andre Russell : రస్సెల్ భారీ సిక్స్.. ఏంటి భయ్యా అలా బాదేశావు అంటున్న నెటిజన్స్

దిశ, వెబ్ డెస్క్ : భారీ షాట్లతో బౌలర్లకే కాకుండా క్రికెట్ ప్రేమికుల మతులు పోగొట్టే ఆండ్రే రస్సెల్(Andre Russell).. నేడు మరో భారీ షాట్ తో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్ 2025(IPL 2025)లో మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), ఢిల్లీ క్యాపిటల్స్(DC) మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ జట్టులో.. 18వ ఓవర్లో ఫీల్డ్ లోకి వచ్చిన రస్సెల్.. ఏకంగా 106 మీటర్ల భారీ సిక్స్(long Six) కొట్టి ఈ సీజన్‌లో అతి పొడవైన సిక్స్ గా రికార్డు సృష్టించాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఫుల్ టాస్ బంతిని రస్సెల్ బలంగా బాది చేసి స్టేడియం బయటకు పంపించాడు.
ఈ మ్యాచ్ లో రస్సెల్ 2 ఫోర్లు, ఒక సిక్స్ తో సహ 17 పరుగులు చేసి వాహ్ అనిపించాడు. అయితే ఈ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన ఈరోజు.. రస్సెల్ బర్త్ డే కావడం మరో విశేషం. అయితే రస్సెల్ అభిమానులు, ప్రేక్షకులు మాత్రం ఏంటి భయ్యా అలా బాదేశావు అని ఆశ్చర్యపోతున్నారు.