బెల్లంపల్లిలో 80 గ్రాముల గంజాయి పట్టివేత

by Sridhar Babu |   ( Updated:2024-12-14 10:36:44.0  )
బెల్లంపల్లిలో 80 గ్రాముల గంజాయి పట్టివేత
X

దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 80 గ్రాముల గంజాయితో ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ముందు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న పెద్దపెల్లి జిల్లా అంబేద్కర్ నగర్ కు చెందిన ఎండీ. జావీద్, ఎండీ. సల్మాన్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద 80 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి తరలింపు సమాచారం మేరకు రైల్వే స్టేషన్ వద్ద నిందితులను పట్టుకున్నారు. పంచనామా చేసి బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు గంజాయితో సహా నిందితులను తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకున్న వారిలో టూ టౌన్ ఎస్ఐ మహేందర్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed