Sonu Sood: పారిపోవడానికి రెడీగా ఉండండి.. ‘ఫతే’ అప్డేట్ ఇచ్చిన సోనూసూద్

by Hamsa |
Sonu Sood: పారిపోవడానికి రెడీగా ఉండండి.. ‘ఫతే’ అప్డేట్ ఇచ్చిన సోనూసూద్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్(Sonu Sood) నటిస్తున్న తాజా చిత్రం ‘ఫతే’(Fateh). ఈ సినిమాకు ఆయన స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సోనూసూద్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez) హీరోయిన్‌గా నటిస్తుండగా.. విజయ్ రాజ్(Vijay Raj), సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా, కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే దీనిని జీ స్టూడియోస్(Zee Studios), శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సోనాలి సూద్(Sonali Sood), ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ విడుదలై ‘ఫతే’పై అంచనాలు పెంచింది. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, సోనూసూద్ ‘ఫతే’ నుంచి అప్డేట్ రాబోతున్నట్లు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘ఫతే’ సినిమాకు సంబంధించిన ‘హిట్‌మ్యాన్’(Hitman) సాంగ్ డిసెంబర్ 17న విడుదల అవుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా గట్ పట్టుకుని హాట్ బ్యూటీస్ మధ్యలో నిల్చున్న పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరిలో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ పోస్టుకు సోనూసూద్ ‘‘ఎగిరి పోవడానికి రెడీగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు.

Advertisement

Next Story

Most Viewed