రిజర్వేషన్ల పేరుతో మోసం: మంత్రి సత్యకుమార్‌ సంచలన ఆరోపణలు

by srinivas |
రిజర్వేషన్ల పేరుతో మోసం: మంత్రి సత్యకుమార్‌ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్(YS Jagan) ప్రభుత్వంపై మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌(Minister Satyakumar Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల పేరుతో బీసీ(B.C)లను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఏపీ గౌడ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్(AP Gowda Welfare and Development Corporation) చైర్మన్‌గా వీరంకి వెంకట గురుమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల కోసం రూ.75 వేల కోట్లు కేటాయిస్తానని చెప్పి జగన్‌ దగా చేశారని విమర్శించారు. బీసీల అభ్యన్నతి కోసం వినియోగించాల్సిన నిధుల్ని దారి మళ్లించారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.

సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే రూ.39 వేల కోట్లు కేటాయించారని సత్యకుమార్ తెలిపారు. బీసీలపై నిజమైన ప్రేమ చూపింది తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)యేనని చెప్పారు. జగన్‌ కేవలం మాటల మనిషేనని ప్రజలు వాస్తవాన్ని తెలుసుకున్నారన్నారు. బీసీల సాధికారత కోసం శ్రీకారం చుట్టింది మహానాయకుడు మాజీ సీఎం నందమూరి తారక రామారావు(Former CM Nandamuri Taraka Rama Rao)నేనని చెప్పారు. బీసీల సంక్షేమం కోసం రాజ్యంగబద్ధంగా కులగణన చేసుకునే అవకాశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కల్పించారని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed