విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వేముల వీరేశం

by Mahesh |
విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వేముల వీరేశం
X

దిశ, నకిరేకల్: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham) తెలిపారు. ఎస్ఎల్‌బీసీ(SLBC) గురుకుల బాలికల పాఠశాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచిందన్నారు. నేటి విద్యార్థులే భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. గత ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది కానీ వసతులు కల్పించలేదని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో 30 ఎకరాల్లో 250 కోట్ల రూపాయలను ఖర్చు చేసి గురుకులాలు అన్ని ఒకే చోట నిర్మిస్తామని హామీలు ఇచ్చారు. విద్యార్థులు కూడా కష్టపడి గొప్పగా ఎదగాలని సూచించారు. ఇష్టంగా చదివితే గొప్పగా విజయాలు సాధించవచ్చున్నారు

Advertisement

Next Story

Most Viewed