Bhatti Vikramarka : త్వరలోనే మరో మెగా డీఎస్సీ : భట్టి విక్రమార్క

by M.Rajitha |
Bhatti Vikramarka : త్వరలోనే మరో మెగా డీఎస్సీ : భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ వినిపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka). త్వరలోనే 6 వేల పోస్టులతో మెగా డీఎస్సీ(Mega DSc) వేయబోతున్నట్టు భట్టి విక్రమార్క ప్రకటించారు. నేడు రాష్ట్రవ్యాప్త 'ఒకరోజు హాస్టల్ తనిఖీ'(One Day Hostels Inspections) కార్యక్రమంలో ఖమ్మం, మధిర, బోనకల్ లోని సంక్షేమ, గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్టల్స్ లో నేటి నుంచి కొత్త మెనూను అధికారంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు 5 ఏళ్లలో ఒక్కసారి కూడా హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదని మండి పడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక వెంటనే 40% డైట్, కాస్మోటిక్ ఛార్జీలు.. పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచామని పేర్కొన్నారు. త్వరలోనే 6 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని భట్టి వెల్లడించారు. ఈ సందర్భంగా.. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం.. విద్యార్థులకు ఆరోగ్యకరమైన మెనూ అందించాలని, నాణ్యమైన పదార్థాలనే వంటల్లో వాడాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed