బోనకల్ మండలాని చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

by Sumithra |
బోనకల్ మండలాని చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
X

దిశ, బోనకల్ : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చేరుకోగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాలి దుర్గారావు, గ్రామ శాఖ అధ్యక్షులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ పిల్లలమర్రి మహేశ్వరి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. మధిర నియోజకవర్గం బోనకల్లు మండలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శనివారం 20 కోట్ల 14 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.‌ అలాగే బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 60 లక్షల రూపాయలతో నిర్మాణం చేయనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే బోనకల్ మండల కేంద్రంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 19.45 లక్షల రూపాయలతో నిర్మాణం చేయనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

Advertisement

Next Story