Konda Surekha: అందరికీ ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది

by Gantepaka Srikanth |
Konda Surekha: అందరికీ ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాలుష్య నియంత్రణ(Pollution Control)కు కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్(NCAP)పై సుదీర్ఘ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సురేఖ(Minister Konda Surekha) మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి వ్యక్తికి ఆరోగ్యంగా జీవించే హక్కు ఉందని అన్నారు. పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపైనా ఉందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ, వాతావరణ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలను చేపడతున్నామని అన్నారు.

ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్విరాన్ మెంట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ ఆధ్వర్యంలో అమలవుతున్న నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) కార్యాచరణ ప్రణాళికలను టీజీపీసీబీ ఎన్ క్యాప్ నోడల్ ఆఫీసర్ డి.ప్రసాద్ మంత్రి సురేఖకు వివరించారు. దేశవ్యాప్తంగా 131 అత్యంత కాలుష్య నగరాలను గుర్తించగా, తెలంగాణ నుంచి హైదరాబాద్, నల్గొండ, సంగారెడ్డిలు ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు.

Advertisement

Next Story

Most Viewed