గెలుపే ధ్యేయంగా పని చేయాలి : ఆదిలాబాద్ ఎమ్మెల్యే

by Aamani |
గెలుపే ధ్యేయంగా పని చేయాలి :  ఆదిలాబాద్ ఎమ్మెల్యే
X

దిశ,ఆదిలాబాద్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పార్టీ నాయకులకు సూచించారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. బీజేపీ అంటేనే క్రమశిక్షణతో కూడుకున్నదని, నాయకత్వం పై నమ్మకాన్ని నిలబెట్టుకుంటే గెలుపు దానంతట అదే వస్తుందని తెలిపారు. ప్రజల కోసం ప్రతి ఒక్కరు పని చేయాలని, అప్పుడే మనతోపాటు పార్టీ కూడా బలపడుతుందని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఆకుల ప్రవీణ్, జోగు రవి, అస్తక్ సుభాష్,రాకేష్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed