పదవులపై నజర్.. గ్రామాలపై దృష్టి సారించిన పోటీదారులు

by Aamani |
పదవులపై నజర్.. గ్రామాలపై దృష్టి సారించిన పోటీదారులు
X

దిశ, ఉట్నూర్ : అన్నా నమస్తే.. బాగున్నావా.. ఏం చేస్తున్నావ్.. ఇప్పుడు మన పంచాయతీలో ఎన్నికలు వస్తున్నాయి కదా.. రిజర్వేషన్ ప్రకారం మనకు అవకాశం వస్తే పోటీ చేస్తా.. పోటీలో నేను ఉంటే నన్ను భారీ మెజారిటీ తో గెలిపించాలన్నా.. అంటూ గ్రామాల్లో పోటీ చేసే అభ్యర్థులు సమీప బంధువులు, స్నేహితులు, ప్రజలతో ఫోన్ ల ద్వారా, ముఖాముఖీగా జిల్లాలో చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల కోసం ఓటరు జాబితాను విడుదల చేయడగా.. పంచాయతీ పదవులపై నజర్ వేసిన నాయకులు బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల వేడి పల్లెలకు తాకింది. గ్రామానికి ఆయా పార్టీల ముఖ్య నేతలు వచ్చినప్పుడు అంతా తానై నడిపిస్తున్నట్లు గ్రామాల్లో ఇప్పటి నుంచి వ్యవహరిస్తున్నారు. ఆయా పార్టీల అనుచరులతో కలిసి పెద్ద పెద్ద లీడర్ల దృష్టిలో పడేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.

పండగలు వచ్చే తరుణంలో పదవుల కోసం పాకులాడే నాయకులు యువతను తమ వైపునకు తిప్పుకునేందుకు జోరుగా విశ్వ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల గ్రామాల్లో వినాయక చవితి సందర్భంగా పోటీలలో పాల్గొనే నేతలు గణేశ్ విగ్రహాలను కొనివ్వడం, ప్రతిష్టంచడంతో పాటుగా అన్నదాన కార్యక్రమాలు వంటివి ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఎ చిన్న సమస్య తలెత్తిన అక్కడ చేరుకుని సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథక ఫలాలు అందేలా చూడటం, ప్రభుత్వ ఆఫీసుల్లో ఏవైన పనులు ఉంటే అధికారులతో మాట్లాడి పనులు చేయించడం వంటివి ఇప్పటి నుంచి చేస్తున్నారు. కాగా రిజర్వేషన్ ఎవరికి అనుకూలంగా వస్తుందో.. ఎవరికి అదృష్టం వరిస్తుందో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే..

సోషల్ మీడియాలో మెసేజ్ ల పర్వం...

గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్, జెడ్పీటీసీ, ఎంపీపీల స్థాయి వరకు పోటీలలో పాల్గొనే నాయకులు ఎక్కువగా సోషల్ మీడియాలను నమ్ముతున్నారు. ముఖ్య పార్టీల నాయకులు గ్రామపంచాయతీకి మూడు నాలుగు గ్రూపులను క్రియేట్ చేస్తు ఇప్పటి నుంచి హల్చల్ చేస్తు సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంటున్నారు. పంచాయతీల పరిధిలో సమస్యలపై ఎది కావాలో దానిపై చర్చ జరిగేలా జనాలను ఆకర్షించే విధంగా పోటీలలో పాల్గొనే అనుచరులు, యూత్ తో పోస్ట్ చేపిస్తున్నారు. దీనిపై ఎన్ని కామెంట్స్, లైక్ లు వస్తున్నాయోనని లెక్కిస్తున్నారు.

పోటీలకు అవకాశవాదులు...

ఆదిలాబాద్ జిల్లాలో 17 మండలాల్లో 473 గ్రామపంచాయతీ ఉన్నాయి. ఇందులో 4లక్షల 41వేల 700 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి పంచాయతీలలో బహుముఖంగా పోటీలు చేసే అవకాశాలున్నాయి. ముఖ్య నేతల పర్యటనలో ముందుంటున్నారు. ఎన్నికలు సమీపించే కొద్ది పైరవీలు మొదలైయ్యాయి. మొత్తానికి పంచాయతీ ఎన్నికలకు పోటీలలో ఏవరికి అవకాశాలు కల్పించాలో ముఖ్యనేతలకు తీవ్ర తలనోప్పే..

Advertisement

Next Story

Most Viewed