ఎమ్మెల్యే వివేక్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసే హక్కు వాళ్లకి లేదు.. మాల సంక్షేమ సంఘం నాయకులు

by Sumithra |
ఎమ్మెల్యే వివేక్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసే హక్కు వాళ్లకి లేదు.. మాల సంక్షేమ సంఘం నాయకులు
X

దిశ, బోథ్ : మాల జాతి ముద్దుబిడ్డగా గడ్డం వివేక్ వెంకటస్వామి మాలల హక్కుల కోసం పోరాటం చేస్తున్నాడని ఆయనను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేయడం సరైంది కాదని మాల సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. బుధవారం బోథ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ నాయకులు వివేక్ ను ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని డిమాండ్ చేయడానికి ఎలాంటి హక్కు లేదన్నారు. మాలల జనాభాను తక్కువ చేసి చూపించి ఎస్సీ వర్గీకరణ చేశారన్నారు. 2024 లెక్కల ప్రకారం శాస్త్రీయంగా వర్గీకరణ చేయాలని మాల సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎల్క రాజు, జాయింట్ సెక్రెటరీ మునేశ్వర సోమన్న, గ్రామ కమిటీ అధ్యక్షులు సురేందర్, ప్రధాన కార్యదర్శి ఊసన్నలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed