సీఎం సిద్ధరామయ్యకి మరో షాక్..ముడా చీఫ్ మరిగౌడ రాజీనామా

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-16 11:01:07.0  )
సీఎం సిద్ధరామయ్యకి మరో షాక్..ముడా చీఫ్ మరిగౌడ రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్ : మైసూర్ అర్భన్ డెవలప్ మెంట్ అథార్టీ(ముడా) స్కామ్ లో చిక్కుకున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరోషాక్ తగిలింది. ముడా చీఫ్ మరిగౌడ ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ బుధవారం రాజీనామా చేయడం సంచలనంగా మారింది. సీఎం సిద్ధరామయ్యకు మరిగౌడ అత్యంత సన్నిహితుడు. 1983 నుంచి సిద్ధరామయ్యతో కలిసి పనిచేస్తున్నాడు. 1995లో మైసూర్ తాలూకా పంచాయతీ అధ్యక్షుడిగా, 2000లో జిల్లా పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. మరిగౌడ రాజీనామాపై సిద్ధరామయ్య ఇంకా స్పందించలేదు. గత నెలలో మరిగౌడ కారులో బెంగళూరుకు వెళ్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మైసూరుకు తరలించారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగానే రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ముడా స్కామ్ లో చిక్కుకున్న సీఎంపై విచారణ కొనసాగుతున్న వేళ.. మరిగౌడ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముడా స్కామ్ లో సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముడా స్కామ్ లో ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు సిద్ధరామయ్యపై లోకాయుక్త విచారణ ప్రారంభించింది .మైసూర్ లోకాయుక్త, ఈడీ కేసులు పెట్టింది. ఇదే కాకుండా సిద్ధరామయ్య సాక్ష్యాలు నాశనం చేసిన ఆరోపణల్ని కూడా ఎదుర్కొంటున్నాడు.

ఈ స్కామ్ నేపథ్యంలోకి వెళితే మైసూర్ నగరాభివృద్ధి కోసం సీఎం భార్య పార్వతి నుంచి మూడెకరాల భూమిని తీసుకుంది. అయితే, దీనికి ప్రతిఫలంగా పొందిన భూమి ఇచ్చిన భూమి కన్నా కొన్ని రెట్లు విలువైనది కావడంతో వివాదం ప్రారంభమైంది. మైసూర్ లో అత్యంత విలువైన విజయనగర్ ప్రాంతంలో 14 ప్లాట్లను ఆమెకు కేటాయించడం మొత్తం వివాదాస్పదంగా మారింది. ఈ కేసుపై పలువురు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కు ఫిర్యాదు చేయడంతో అసలు కథ మొదలైంది.

గవర్నర్ సీఎం సిద్ధరామయ్యపై విచారణకు ఆదేశించారు. అయితే, ఈ ఆదేశాలను కర్ణాటక హైకోర్టులో సీఎం నవాల్ చేశారు. విచారించిన హైకోర్టు సీఎం విచారణ ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆదేశించింది. మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ, జేడీఎస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా ముడా స్కామ్ విచారణ క్రమంలో విజయనగర్ లోని అప్ మార్కెట్ మైసూరు ఏరియాలో ఉన్న 14 ప్లాట్ల భూమిని సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతి తిరిగి ముడా సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న 'ముడాకు చెందిన 14 ప్లాట్లు తిరిగి అదే సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తాను దర్యాప్తుకు కూడా సహకరిస్తానని తెలిపారు. ఇక ఈ స్థలాలను వెనక్కి తీసుకునేందుకు ముడా అధికారులు కూడా అంగీకరించారు.

Advertisement

Next Story

Most Viewed