Air strikes: దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడి.. మేయర్ సహా ఐదుగురు మృతి

by vinod kumar |
Air strikes: దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడి.. మేయర్ సహా ఐదుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. తాజాగా దక్షిణ లెబనాన్‌లోని నబాతీయే పట్టణంలోని రెండు మున్సిపాలిటీ భవనాలపై వైమాణిక దాడి చేసింది. ఈ దాడిలో పట్టణ మేయర్‌తో సహా ఐదుగురు మరణించినట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నబాతియా, దాని పరిసర ప్రాంతాలపై 11 వైమానిక దాడులు చేసినట్టు వెల్లడించింది. భారీగా ఆస్తి నష్టం సైతం జరిగినట్టు వెల్లడించింది. దాడి అనంతరం రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించాయి. అయితే తాజా దాడులపై ఇజ్రాయెల్ స్పందిచలేదు.

లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. యూఎస్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ.. తమ ఆందోళనలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు తెలియజేసినట్టు తెలిపారు. ‘గత కొన్ని రోజులగా బీరూట్‌ దాడులను గమనిస్తున్నాం. వీటిపై ఎన్నో ఆందోళనలు ఉన్నాయి. తమ అభిప్రాయాలను ఇజ్రాయెల్ ప్రభుత్వానికి తెలియజేశాం’ అని వ్యాఖ్యానించారు. కాగా, లెబనాన్ రాజధాని బీరూట్‌పై కొన్ని వారాలుగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అనేక మంది లెబనీస్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Next Story

Most Viewed