విదేశాలలో చదివే విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పెంపు

by Kalyani |
విదేశాలలో చదివే విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పెంపు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులకు, ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు హైదరాబాద్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ పెరిక యాదయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్ లో ఈనెల 29 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు https://telanganaepass.cgg.giv.in లో సంప్రదించాలని అయన సూచించారు.

Advertisement

Next Story

Most Viewed