- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లను సిద్ధం చేయాలి : హనుమకొండ అదనపు కలెక్టర్
దిశ, హనుమకొండ : జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ పై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దొడ్డు, సన్న రకం ధాన్యానికి సంబంధించిన కనీస మద్దతు ధర తెలిపే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. దొడ్డు, సన్న రకం ధాన్యాల కొనుగోలుకు వేరువేరు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 లను బోనస్ ప్రకటించిందని, వాటి కొనుగోలులో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
సన్న రకం ధాన్యాన్ని గుర్తించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో డిజిటల్ మైక్రో కాలిపర్స్, ప్యాడి క్లీనర్స్, డ్రయ్యర్ ను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన సన్న రకం ధాన్యం బస్తాలకు ఎరుపు రంగు దారంతో కుట్లు వేయాలన్నారు. దొడ్డు రకం ధాన్యం సంచులకు ఆకుపచ్చ రంగు దారంతో కుట్లు వేయాలన్నారు. సన్నరకం ధాన్యం నింపే కొత్త సంచులను తిరగేసి ధాన్యం నింపిన అనంతరం వాటికి సంబంధించిన వివరాలను సంచులపై ఎస్ గుర్తుతో పాటు సెంటర్ నెంబర్ స్టెన్సిల్తో మార్క్ చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కు సంబంధించి వ్యవసాయ అధికారులు అందించిన టోకెన్ ఆధారంగానే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలును చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఉమారాణి, మేనేజర్ మహేందర్, జిల్లా సహకార అధికారి నీరజ, అసిస్టెంట్ రిజిస్టర్ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జేడీ రవీందర్ సింగ్, జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ, ఇతర అధికారులతో పాటు ఫ్యాక్స్ కార్యదర్శులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జులు పాల్గొన్నారు.