అపరిశుభ్రంగా పుష్కర ఘాట్లు..

by Sumithra |
అపరిశుభ్రంగా పుష్కర ఘాట్లు..
X

దిశ, అలంపూర్ : కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో అలంపూర్ పుణ్యక్షేత్రంలోని జోగులాంబ దేవాలయం పుష్కర ఘాట్ కి తుంగభద్ర స్నానానికి వస్తుంటారు. కానీ పుణ్య స్నానాలు చేయడానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుంగభద్ర పుష్కర ఘాట్ మొత్తం బురద మయంగా, చెత్తాచెదారంతో, అపరిశుభ్రంగా ఉండటంతో భక్తులు అలాగే మురికి కూపంలోనే స్నానాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కార్తీక మాసం పూజలు ముగింపు దశకు వస్తున్న పుష్కర ఘాటును ఒకరోజు కూడా శుభ్రం చేసిన దాఖలాలు లేవని భక్తులు వాపోతున్నారు.

ఈ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో జోగులాంబ బాలబ్రమేశ్వరుని ఆలయాలకు వచ్చి ముందుగా తుంగభద్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేయడం ఇక్కడ ప్రత్యేకం. పుష్కర ఘాట్లు అపరిశుభ్రంగా ఉండడంతో చాలామంది భక్తులు పుణ్యస్నానాలు చేయడం లేదని, ఆలయ ఈవోకు ఎన్నోసార్లు తెలిపిన పట్టించుకోవడంలేదని భక్తులు వాపుతున్నారు. కనీసం వసతులు లేకపోవడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. రోజుకు 20 వేల నుండి 30 వేల మంది భక్తులు జోగులాంబ బాలబ్రహ్మేశ్వరునికి కార్తీక మాసంలో దర్శనం నిమిత్తం వస్తునట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed