Kanguva: ఓటీటీలోకి సూర్య కంగువ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..?

by Kavitha |
Kanguva: ఓటీటీలోకి సూర్య కంగువ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. అలా సూర్య హీరోగా, దిశా పటాని హీరోయిన్‌గా నటించిన సినిమా ‘కంగువ’. సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా భారీ వ్యయంతో నిర్మించాయి. ఇక ఈ మూవీలో బాబీ డియోల్, కోవై సరళ, యోగిబాబు, రెడ్టిన్ కింగ్స్లీ, నటరాజన్ సుబ్రమణియన్, జగపతి బాబు, కె ఎస్ రవికుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇక ఈనెల 14న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దాదాపు 350 కోట్లకు పైగా ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించిన టాక్ కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. పలు నివేదికల ప్రకారం అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని 100 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని అంటున్నారు. అలాగే డిసెంబర్ 13న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Advertisement

Next Story

Most Viewed