గిన్నిస్ రికార్డ్.. ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషీన్ రూపొందించిన భారతీయుడు

by Jakkula Mamatha |
గిన్నిస్ రికార్డ్..  ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషీన్ రూపొందించిన భారతీయుడు
X

దిశ,వెబ్‌డెస్క్: మనిషి అనుకుంటే సాధ్యం కానిది ఏమి ఉండదని ఓ భారతీయుడు నిరూపించాడు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీకి అనుకులంగా మనిషి ఆలోచించడం మొదలు పెట్టాడు అనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్‌లో చాలామంది తమ నైపుణ్యంతో కొత్త కొత్త పరికరాలు సృష్టిస్తున్నారు. తాజాగా ఇటువంటిదే ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఓ భారతీయుడు సెబిన్ సాజీ తన ఇంజినీరింగ్ నైపుణ్యంతో ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మెషీన్‌ను రూపొందించారు. దీంతో అతను ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే ఈ వాషింగ్ మెషిన్ కొలతలు వరుసగా 1.28 1.32, 1.52 అంగుళాలు మాత్రమే ఉంటుంది.

ఇది కేవలం 0.65 సెంటీమీటర్లు మాత్రమే ఉంది. సూక్ష్మ పరిమాణంలో ఉన్నప్పటికీ ఇది సాధారణ వాషింగ్ మెషీన్‌లానే పనిచేస్తుందంట. ఇప్పుడు సూక్ష్మ వాషింగ్ మెషిన్ గిన్నిస్ రికార్డు సాధించింది. గిన్నిస్ రికార్డు కోసం సాజీ దానిని డిజైన్, అసెంబుల్ చేసి ఆపై అది పనిచేస్తున్నట్టు ప్రదర్శించి చూపించాడు. అంటే వాష్, రిన్స్, స్పిన్ వంటి అన్ని ఫంక్షన్లు పనిచేస్తున్నట్టు చూపించాడు. అతడు దానిని కొలిచేందుకు ప్రత్యేక డిజిటల్ కాలిపర్స్‌ను ఉపయోగించాడు. ఈ అతి చిన్న వాషింగ్ మెషిన్‌ను చూసెందుకు పొటెత్తారు.

Advertisement

Next Story

Most Viewed