సంగీత దర్శకుడి ఈవెంట్ కోసం గచ్చిబౌలి స్టేడియంలో ట్రాక్ తవ్వకాలు

by Kalyani |
సంగీత దర్శకుడి ఈవెంట్ కోసం గచ్చిబౌలి స్టేడియంలో ట్రాక్ తవ్వకాలు
X

దిశ, శేరిలింగంపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామని, భవిష్యత్తులో ఒలంపిక్స్ క్రీడలను నిర్వహించేలా సదుపాయాలు కల్పిస్తామని స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండగా.. ఆయన మాటలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) అధికారాలు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియాన్ని ఇటీవల రూ.20 కోట్లతో అభివృద్ధి చేశారు. ప్రైవేట్ ఈవెంట్లకు అనుమతులు ఇవ్వద్దని ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) అధికారాలు మాత్రం ఈ నెల 19న గచ్చిబౌలి ఫుట్ బాల్ స్టేడియంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈవెంట్ కు అనుమతులు ఇచ్చారు. దీంతో ఈవెంట్ కోసం స్టేడియంలోని అథ్లెటిక్ ట్రాక్ పై భారీ సెట్ వేశారు. ఇందుకుగాను స్టేడియంలో భారీగా గుంతలు తవ్వకాలు జరిపారు. దీంతో చాలా వరకు ట్రాక్ దెబ్బతింది. క్రీడాకారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి ఈవెంట్స్ కు పర్మిషన్లు ఇవ్వడం వల్ల క్రీడాకారుల సాధనకు ఆటకం ఏర్పడుతుందని క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేడియాలను ఇకపై క్రీడేతర కార్యక్రమాల నిర్వహణకు, ఈవెంట్స్ ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించాక కూడా శాట్ సిబ్బంది తీరు మార్చుకోక పోవడం వల్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed