Youtube New Features: యూట్యూబ్‌లో సరికొత్త ఫీచర్లు..ఇకపై టైమ్ సెట్ చేసి నిద్రపోవచ్చు

by Maddikunta Saikiran |
Youtube New Features: యూట్యూబ్‌లో సరికొత్త ఫీచర్లు..ఇకపై టైమ్ సెట్ చేసి నిద్రపోవచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌(Youtube) యూజర్లను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక విషయాలలో సరికొత్త అప్‌డేట్(Update)లను అందుబాటులోకి తీసుకొచ్చిన యూట్యూబ్‌ తాజాగా మరో మూడు కొత్త ఫీచర్ల(Three New Features)ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. స్లీప్‌ టైమర్‌(Sleep Timer), రిసైజబుల్‌ మినీ ప్లేయర్‌(Resizable Mini Player), ఫేవరేట్‌ ప్లే లిస్ట్(Favorite Play List) ఇలా కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ తన బ్లాగ్ లో పోస్ట్‌ చేసింది. ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో అందులో సృష్టంగా వివరించింది.

స్లీప్‌ టైమర్‌ ..

మనలో చాలామంది యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తూ నిద్రపోతుంటారు. నిద్రపోయాక ప్లే అవుతున్నా వీడియోలను ఆఫ్ చేయడం కష్టమైన పని. తాజాగా ఇటువంటివారికోసం యూట్యూబ్‌ స్లీప్‌ టైమర్‌ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సాయంతో యూజర్ ఏదైన వీడియో చూస్తున్నప్పుడు టైమర్ సెట్ చేసుకోవచ్చు. మనం సెట్ చేసుకున్నటైమ్ తరువాత వీడియో ఆటోమెటిక్ గా ఆగిపోతుంది. ఈ ఫీచర్ ను యాక్సెస్ చేసుకోవాలంటే వీడియో ప్లే చేసిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే సెట్టింగ్స్‌ ఐకాన్‌ను ట్యాప్‌ చేయగానే ‘Sleep Timer’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి మీకు కావాల్సిన టైమ్‌ సెట్‌ చేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికే పరిమితమైన ఈ ఫీచర్‌ ఇప్పుడు నార్మల్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది.

రిసైజబుల్‌ మినీ ప్లేయర్‌..

యూట్యూబ్‌లో మినీ ప్లేయర్‌ జనరల్ గా కుడివైపు కింది భాగంలో కనిపిస్తుంది. అయితే ఇకనుంచి మినీ ప్లేయర్‌ను మీకు నచ్చిన ప్లేసులోకి చేంజ్ చేసుకోవచ్చు. అంతేకాదు కావావలంటే సైజ్‌ను పెంచుకునే లేదా తగ్గించుకునే అవకాశం యూట్యూబ్‌ కల్పించింది.

ప్లే లిస్ట్‌ కు థంబ్‌నైల్స్‌..

ప్లే లిస్ట్‌ క్రియేట్‌ చేసుకునే సౌకర్యం ఇప్పటికే యూట్యూబ్‌ లో అందుబాటులో ఉంది. వాటిని క్యూ ఆర్‌ కోడ్‌ సాయంతో నచ్చిన వ్యక్తులకు పంపే సదుపాయాన్ని కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు ఆ లిస్ట్‌కు నచ్చిన థంబ్‌నైల్స్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సహాయంతో క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే యూజర్లు ఫొటోలను కూడా పెట్టుకోవచ్చని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed