ఆ పాలసీల్లో జోక్యం చేసుకోవద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

by srinivas |   ( Updated:2024-10-16 14:08:09.0  )
ఆ పాలసీల్లో జోక్యం చేసుకోవద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కొత్త మద్యం పాలసీ(New Liquor Policy) అమల్లోకి వచ్చింది. అయితే వైన్ షాపుల విషయంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం చంద్రబాబు(CM Chandrabab) సీరియస్ అయ్యారు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యం పాలసీలో ఎమ్మెల్యేలు ఎవరూ జోక్యం చేసుకోకూడదని ఆదేశించారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఉపేక్షించేది లేదని, వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయిపైనా చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎక్కడ నేరం జరిగినా గంజాయ్ బ్యాచ్ ఉంటుందని మండిపడ్డారు. ఇకపై గంజాయికి రాష్ట్రంలో చోటు ఉండకూడదని తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలన్నారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే సంఘ బహిష్కరణేనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇసుక విధానం(Sand Method)పైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక ఎక్కడైనా తోడుకోవచ్చని తెలిపారు. ఇసుకను తీసుకెళ్లే హక్కు స్థానికులకు ఉందని చెప్పారు. ఎవరైనా జోక్యం చేసుకుంటే వెంటనే సస్పెండ్ చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

Advertisement

Next Story