Supreme Court: ఇకపై చట్టం గుడ్డిది కాదు.. సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహం

by vinod kumar |
Supreme Court: ఇకపై చట్టం గుడ్డిది కాదు.. సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఇది న్యాయవ్యవస్థ మొత్తం ఆలోచనా విధానాన్ని మార్చేసింది. సీజేఐ చంద్రచూడ్ ఆదేశాల మేరకు పాత విగ్రహానికి పలు మార్పులు చేస్తూ న్యాయమూర్తుల లైబ్రరీలో దీనిని ఆవిష్కరించారు. న్యాయ దేవత విగ్రహంలో అంతకుముందు కళ్లకు గంతలు, రెండు చేతుల్లో భాగంగా.. కుడి చేతిలో త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉండేవి. అయితే నూతన విగ్రహంలో కళ్లకు గంతలు తొలగించారు. దేశంలో చట్టం గుడ్డిది కాదనే స్పష్టమైన సందేశాన్ని ఇవ్వడానికే సుప్రీంకోర్టు ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. అలాగే లెఫ్ట్ హ్యాండ్‌లో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగ పుస్తకాన్ని ఉంచారు. ఇటీవల భారత ప్రభుత్వం బ్రిటిష్ పాలన నుంచి అమలులో ఉన్న క్రిమినల్ చట్టాలను మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే న్యాయ దేవత విగ్రహానికి మార్పులు చేసినట్టు పలువురు భావిస్తున్నారు. ఈ విగ్రహం వలస వారసత్వాన్ని వదిలిపెట్టే ప్రయత్నంగా పరిగణిస్తున్నారు. బ్రిటీష్ వారసత్వం నుంచి భారత్ ముందుకు సాగాలని చంద్రచూడ్ విశ్వసిస్తున్నారని.. చట్టం ఎప్పుడూ గుడ్డిది కాదని, అది అందరినీ సమానంగా చూస్తుందని సీజేఐ కార్యాలయం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed