Satellite Connectivity: భారత్‌లో తొలిసారి శాటిలైట్ కనెక్టివిటీ సేవల ట్రయల్ విజయవంతం

by S Gopi |
Satellite Connectivity: భారత్‌లో తొలిసారి శాటిలైట్ కనెక్టివిటీ సేవల ట్రయల్ విజయవంతం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో మొదటిసారిగా డైరెక్ట్-టూ-డివైజ్ శాటిలైట్ కనెక్టివిటీ ట్రయస్ల్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. దీన్ని శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వయాశాట్, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ నిర్వహించాయి. డైరెక్ట్-టూ-డివైజ్ కనెక్టివిటీ అనేది మొబైల్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, కార్లు వంటి ఉపయోగించే పరికరాలకు నెట్‌వర్క్ అందిస్తుంది. అంతేకాకుందా పారిశ్రామిక యంత్రాలు, రవాణా ఆపరేటర్లకు ఉపగ్రహాల ద్వారా కనెక్ట్ చేసేందుకు హార్డ్‌వేర్ అవసరంలేకుండా కవరేజీ లభిస్తుంది. బుధవారం జరిగిన ట్రయల్‌లో నాన్-టెరెస్ట్రియల్ నెట్‌వర్క్(ఎన్‌టీఎన్) కనెక్టివిటీ కోసం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి వయాశాట్ టూ-వే మెసేజింగ్, ఎస్ఓఎస్ మెసేజిగింగ్ ప్రక్రియను నిర్వహించాయి. ఈ మేసేజ్‌లు దాదాపు 36 వేల కిలోమీటర్ల దూరం వయాశాట్‌కు చెందిన జియోస్టేషనరీ ఎల్-బ్యాండ్ ఉపగ్రహానికి చేరాయి. దాంతో వయాశాట్ ఉపగ్రహ నెట్‌వర్క్‌ని ఉపయోగించి దేశీయంగా వినియోగదారులు, వ్యాపారాల సెల్‌ఫోన్ కనెక్టివిటీకి ఉపగ్రహ సేవలు అందించడం సాధ్యమని వయాశాట్ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Next Story