ఆ ఆస్పత్రిలో ఒకే రోజు 25 ప్రసవాలు

by Sridhar Babu |
ఆ ఆస్పత్రిలో ఒకే రోజు 25 ప్రసవాలు
X

దిశ, జగిత్యాల టౌన్ : జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఒకే రోజు 25 ప్రసవాలు చేశారు. అందులో 13 సాధారణ ప్రసవాలు కాగా మిగిలిన 12 సిజేరియన్ ద్వారా చేసినట్టు వైద్యులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది సాయంతో 25 డెలివరీలు చేసి రికార్డు సృష్టించారు. తల్లిబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పారు. దాంతో డాక్టర్లను, నర్సులను, సిబ్బందిని హాస్పిటల్ సూపరింటెండెంట్ రాములు ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story

Most Viewed