Energy Consumer: ప్రపంచంలో మూడో అతిపెద్ద విద్యుత్ వినియోగదారుగా భారత్

by S Gopi |   ( Updated:2024-10-16 16:26:01.0  )
Energy Consumer: ప్రపంచంలో మూడో అతిపెద్ద విద్యుత్ వినియోగదారుగా భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఆదాయాలు మెరుగుపడటం, ప్రజలు సౌకర్యాల కోసం ఏసీ వంటి విద్యుత్ ఎక్కువ అవసరమయ్యే ఉత్పత్తులను వాడుతుండటంతో సగటున 2023లో 15 శాతం విద్యుత్ ఖర్చవుతోంది. ఇది 2050 నాటికి మూడు రెట్లు పెరగనుంది. ఈ నేపథ్యంలో 2050 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విద్యుత్ వినియోగ దేశంగా అవతరించనుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) పేర్కొంది. దానికి ముందు 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థగా మారుతుందని బుధవారం ఐఈఏ విదుడల చేసిన వరల్డ్ ఎనర్జీ ఔట్‌లుక్‌లో తెలిపింది. ప్రతి ఏటా దేశంలో అన్ని రకాల విద్యుత్ డిమాండ్ సగటున 4 శాతం పెరుగుతోందని ఐఈఏ అభిప్రాయపడింది. ఉపకరణాలతో ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నప్పటికీ కూలింగ్ ఉత్పత్తులే విద్యుత్ వినియోగానికి కీలక డ్రైవర్‌గా ఉంది. ఇదే సమయంలో 2050 నాటికి చైనా, యూఎస్‌లలో భారత్‌లో కంటే విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండనుందని ఐఈఏ తెలిపింది. ఒకప్పుడు బొగ్గు అత్యధికంగా వినియోగం జరిగేది, ఆ తర్వాత చమురు ప్రపంచ వృద్ధిని ప్రభావితం చేసింది. అదే తరహాలో భవిష్యత్తు విద్యుత్ వినియోగంపై ఆధారపడి ఉంటుందని ఐఈఏ పేర్కొంది.

Advertisement

Next Story