- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
జగిత్యాలలో వెరైటీ ప్రేమ కథా చిత్రం
దిశ, గొల్లపల్లి : ఆ జంట ప్రేమ పెళ్లి చేసుకుంది. పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా...నిజంగా వింతే ఉంది. ఇది ఓ వెరైటీ ప్రేమ కథా చిత్రం. వివరాల్లోకి వెళితే ప్రేమ గుడ్డిది అనే సామెతను నిజం చేస్తూ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఈ లవ్ మ్యారేజ్ అంగరంగ వైభవంగా జరిగింది. మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు మల్యాల మండలం మ్యడంపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ తో రెండేళ్ల క్రితం ప్రేమలో పడ్డాడు.
వీరి మధ్య చిగురించిన ప్రేమ యువకుడు ఉపాధి కోసం దేశం వీడినా ఆగలేదు. మరింత పెరిగింది. పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్న ఈ జంట యువకుడి ఇంట్లో ఒప్పించి బంధువులు, ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. ప్రేమ జెండర్ కు సంబంధించింది కాదని, మనసుకు మాత్రమే సంబంధించిందని కొత్త జంట చెబుతుంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.