Maruti Suzuki Swift: మారుతీ సుజికీ స్విఫ్ట్ నుంచి కొత్త ఎడిషన్.. ధర, మైలేజ్ ఎంతంటే..?

by Maddikunta Saikiran |
Maruti Suzuki Swift: మారుతీ సుజికీ స్విఫ్ట్ నుంచి కొత్త ఎడిషన్.. ధర, మైలేజ్ ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజికీ స్విఫ్ట్(Maruti Suzuki Swift) లో కొత్తగా బ్లిట్జ్ ఎడిషన్(Blitz Edition)ను ఇండియా మార్కెట్(India Market)లోకి విడుదల చేసింది. ఎల్ఎక్స్ఐLXi, వీఎక్స్ఐ(VXi), వీఎక్స్ఐ(O) మూడు వేరియంట్ లలో ఈ కొత్త ఎడిషన్ కార్లను లాంచ్ చేసింది. వీటి ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 8.02 లక్షల(Ex-showroom)గా కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త ఎడిషన్ 3-సిలిండర్ ఇంజన్‌(3-Cylinder Engine)ను కలిగి ఉంది మైలేజ్(Mileage) విషయానికొస్తే..పెట్రోల్‌తో నడిచే స్విఫ్ట్ యొక్క మాన్యువల్ వెర్షన్ 24.8కిమీ/లీని ఇస్తుంది, ఆటోమేటిక్ వెర్షన్ 25.75కిమీ/లీని అందిస్తుంది. CNG వేరియంట్ 32.85km/kg ఇస్తుంది. ఇక వెనుక భాగంలో అండర్‌బాడీ స్పాయిలర్, ఫ్రంట్ లో ఫాగ్ ల్యాంప్స్, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్స్, రియర్ అప్పర్ స్పాయిలర్, డోర్ వైజర్స్ సైడ్ బాడీ క్లాడింగ్‌ల వంటివి ఉన్నాయి. 9.0-అంగుళాల స్మార్ట్ ప్లేప్రో ప్లస్ టచ్‌స్క్రీన్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, ISOFIX యాంకర్లు, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, సీట్‌బెల్ట్ రిమైండర్‌లతో సహా ఇతర ఫీచర్లతో ఈ కొత్త స్విఫ్ట్ ఎడిషన్ అందుబాటులోకి వచ్చిందని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed