- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi : బీజేపీ తొలి ‘సక్రియ సదస్యుడి’గా ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ ‘సక్రియ సదస్యతా అభియాన్’ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం ప్రారంభించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో ‘సక్రియ సదస్యతా అభియాన్’లో తన పేరును ఆయన నమోదు చేయించుకున్నారు. దీంతో ఈ సభ్యత్వ నమోదు డ్రైవ్‌లో చేరిన తొలి బీజేపీ నేతగా మోడీ నిలిచారు. ఈ డ్రైవ్‌లో చేరే బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు కనీసం 50 మంది కొత్త వారిని పార్టీలో సభ్యులుగా చేర్పించాలి.
ఈసందర్భంగా ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోడీ ఒక పోస్ట్ చేశారు. తానొక సాధారణ బీజేపీ కార్యకర్తనని ఆయన అన్నారు. ఇప్పుడు తొలి సక్రియ సదస్యుడిగా పేరును నమోదు చేయించుకొని, దీనికి సంబంధించిన డ్రైవ్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. బీజేపీని పునాది స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు, దేశాన్ని మున్ముందుకు తీసుకెళ్లేందుకు ‘సక్రియ సదస్యతా అభియాన్’ మంచి అవకాశమన్నారు. బీజేపీలో క్రియాశీలక సభ్యత్వం కలిగినవారు మండల కమిటీ, ఆ పైస్థాయి కమిటీల ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హులని మోడీ చెప్పారు. బీజేపీ సభ్యులుగా ఉండేవారికి పార్టీ కోసం పనిచేసేందుకు భవిష్యత్తులో చాలా అవకాశాలు లభిస్తాయన్నారు. ‘సక్రియ సదస్యతా అభియాన్’ ముగిసిన అనంతరం బీజేపీ అంతర్గత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.