హైడ్రాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

by Gantepaka Srikanth |
హైడ్రాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా(Hydraa)కు తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో ఊరట లభించింది. హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేమని స్పష్టం చేసింది. హైడ్రాను ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి(Telangana Govt) ఉందని తేల్చి చెప్పింది. హైడ్రా ఏర్పాటు జీవో నెంబర్.99, హైడ్రా చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా చట్టవిరుద్ధమెలా అవుతుందని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది.

హైడ్రా చట్టవిరుద్ధంగా చర్యలు చేపడితే వాటిని ప్రశ్నించే అధికారం ఉంటుంది తప్ప ఏర్పాటునే ఎలా ప్రశ్నిస్తారంది. ఒకవేళ చట్టవిరుద్ధంగా ప్రైవేటు ఆస్తుల్లోకి చొరబడినా, ఆస్తులను కూల్చివేసినా నష్టపరిహారం కోరుతూ కింది కోర్టుల్లో పిటిషన్‌లు దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది. అంతేకాకుండా కూల్చివేతలకు సంబంధించి చట్టప్రకారం నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఇదే హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed