- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhas: తెలుగు ఇండస్ట్రీ ప్రభాస్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఖడ్గం’. 2002 వచ్చిన ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించాడు. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ (box office) వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక అక్టోబర్ 18 న మరోసారి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కృష్ణ వంశీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
‘చక్రం’ సినిమాలో ప్రభాస్ (Prabhas) నటించేందుకు ఎలా ఒప్పించారు.. అనే ప్రశ్నకు డైరెక్టర్ కృష్ణ వంశీ స్పందిస్తూ.. ‘ప్రభాస్ (Prabhas) మంచి పెర్ఫామర్. పని పట్లా ఆయన చాలా అంకిత భావంతో ఉంటాడు. కానీ టాలీవుడ్ (Tollywood) ఆయన్ని సరిగ్గా యూస్ చేసుకోవడం లేదు. యాక్షన్‌కే పరిమితం చేస్తున్నారు. అయితే.. ‘చక్రం’ కథ చెప్పిన టైంలో.. యాక్షన్ కథ కూడా చెప్పాను. కానీ అందరూ యాక్షన్ కథలే చెప్తున్నారు ‘చక్రం’ ఫైనల్ చెయ్యండి అని చెప్పారు ఆయన. ఇక 20 ఏళ్ల తర్వాత కూడా ఏం మారలేదు. ఇప్పటికీ డైరెక్టర్లు అందరూ ప్రభాస్‌ను యాక్షన్ కథలకే అంకితం చేస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.