మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించే దాకా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు వదలదు

by Aamani |
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించే దాకా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు వదలదు
X

దిశ,ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లో గల సమ్మక్క సారక్కలను అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. మంత్రి కొండా సురేఖ-కొండా మురళీధర్ రావు దంపతులతో పాటు వారి కూతురు సుస్మిత పటేల్, అల్లుడు అభిలాష్, మనవడు శ్రీయాన్ష్ మురళీకృష్ణతో కలిసి అమ్మవార్లను దర్శించుకుని, నిలువెత్తు బంగారం సమర్పించారు. తమ మనవడి తలనీలాలు సమర్పించిన అనంతరం సమ్మక్క సారక్కల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క పూజారులు మంత్రి కి అమ్మవార్ల చీరె, పసుపు కుంకుమలను అందించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సమ్మక్క-సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించే దాకా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు వదలదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన జాతరను దిగ్విజయవంతంగా చేపట్టిందని అన్నారు. దేవాదాయ శాఖ తరపున మంత్రిగా తాను, గిరిజన బిడ్డ మంత్రి సీతక్క సమ్మక్క సారక్క జాతర ప్రాంత అభివృద్ధి కోసం, సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. తమ కులదైవమైన సమ్మక్క సారక్కలను ప్రతియేడూ దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి బాటలో పయనించాలని, రాష్ట్ర ఆర్థిక కష్టాలు గట్టెక్కాలని,రాష్ట్ర ప్రధాత అయిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశయాల సాధనకు వనదేవతలు శక్తిసామర్థ్యాలను ప్రసాదించాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed