- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:పశ్చిమలో భారీ వర్షాలు.. వివాహ శుభకార్యాలకు ఇబ్బందులు
దిశ ప్రతినిధి,పాలకొల్లు: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా బుధవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. దీంతో జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. భారీ వర్షాల కారణంగా ఉదయం నుంచి బయటకు వెళ్లే మార్గం లేక ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కార్మికులు పనులు లేక ఇబ్బంది పడ్డారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే వరద ముప్పు తప్పదని భయంతో తీరప్రాంత వాసులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే వేటకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి.
వివాహ శుభకార్యాలకు ఏర్పడ్డ ఇబ్బందులు..
అక్టోబర్ 16వ తేదీన అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది వివాహ శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకున్నారు. దీంతో ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో శుభకార్యాలకు వెళ్లి వచ్చే వారు భోజనాలకు, పెళ్లిళ్లకు హాజరయ్యేటపుడు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.