ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన బంగారం గొడవ

by Sridhar Babu |
ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన బంగారం గొడవ
X

దిశ, శంకరపట్నం : ఇండియన్ బ్యాంకు మొలంగూరులో చోటు చేసుకున్న బంగారం గొడవ కొలిక్కి వచ్చింది. కొత్తగట్టు గ్రామానికి చెందిన కందుల విజయ అనే మహిళ బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందింది. రుణం తిరిగి చెల్లించి ఆభరణాలను చూసుకొని చిన్నారి రెండు గాజులు లేవని మేనేజర్​తో వాగ్వాదానికి దిగింది. దీంతో మేనేజర్ బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టుకున్నప్పుడు వారికి ఇచ్చిన రసీదు ప్రకారం ఆ రసీదులో ఏఏ ఆభరణాలు ఉన్నాయో వాటిని తిరిగి ఇచ్చినట్టు తెలిపారు. కానీ సదరు ఖాతాదారురాలు ఇంకా రెండు గాజులు (6 గ్రాములు) బ్యాంకు బాకీ ఉన్నట్లు ఆరోపణలు చేసిందని, అది నిజం కాదన్నారు.

రసీదులో ఆ రెండు గాజులు నమోదు కాలేదని తెలిపారు. చిన్నారి గాజులకు బ్యాంకుకు సంబంధం లేదని పేర్కొన్నారు. కానీ తూనిక వేసే సందర్భంలో 129 గ్రాములకు బదులుగా 114.5 గ్రాములుగా తప్పుగా నమోదు అయిన మాట వాస్తవమే అన్నారు. రసీదులో ఉన్న ఆభరణాలు సరితూగాయని వివరించారు. ఇదే విషయాన్ని బాధిత మహిళను వివరణ అడగగా రసీదులో చిన్నారి గాజులను బ్యాంకు అధికారులు నమోదు చేయలేదనే విషయం మంగళవారమే తెలిసిందని, తమ ఆభరణాలను బ్యాంకు వారే కాజేశారని ఆరోపించారు. అనంతరం ఆధారాలు లేకపోవడంతో బాధితులు వెళ్లిపోయారు.

Advertisement

Next Story

Most Viewed