Viral Video: మీకే ఓటేశాను.. నాకు పెళ్లి చేయండి.. ఎమ్మెల్యేకు వింత అనుభవం

by Ramesh Goud |
Viral Video: మీకే ఓటేశాను.. నాకు పెళ్లి చేయండి.. ఎమ్మెల్యేకు వింత అనుభవం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లో ఓ ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి మీకు ఓటేశాను కాబట్టి నాకు పెళ్లి చేయాలని కోరాడు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చర్ఖారీ నియోజకవర్గ ఎమ్మెల్యే బ్రిజ్ భూషణ్ రాజ్‌పుత్‌ కారులో పెట్రోల్ కోసం ఓ పెట్రోల్ బంక్ కు వెళ్లాడు. అక్కడే పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న అఖిలేంద్ర ఖరే అనే వ్యక్తి ఎమ్మెల్యే వద్దకు వచ్చి పెళ్లి కాకపోవడంపై విచారం వ్యక్తం చేస్తూ.. తనకు పెళ్లి చేయాలని కోరాడు. దీంతో షాక్ అయిన ఎమ్మెల్యే తననే ఎందుకు అడుగుతున్నావని అడిగాడు. దీనికి ఆ వ్యక్తి మీరు నా పెళ్లి సమస్య తీరుస్తారని మీకు ఓటు వేశాను. కాబట్టి మీరే నాకు పెళ్లి చేయాలని బదులిచ్చాడు. ఇది విన్న బ్రిజ్ భూషణ్ వివరాలు చెప్పాలని అడిగాడు. దీంతో ఆ వ్యక్తి తనకు 44 ఏళ్లు అని, తాను కార్వా చౌత్ రోజున జన్మించడంతో కార్వా చౌత్ జరుపుకునే అమ్మాయి దొరకలేదని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి వివరాలు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే తనకు త్వరలోనే పెళ్లి జరిపిస్తానని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెట్టింట దీనిపై తెగ చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed