ప్రభుత్వ భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

by Sridhar Babu |
ప్రభుత్వ భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
X

దిశ,ధర్మారం : మండలంలో జరుగుతున్న ప్రభుత్వ భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు ఆదేశించారు. ధర్మారం మండల కేంద్రంలో బుధవారం ఆయన పర్యటించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఏపీఎం కార్యాలయాలను కలెక్టర్ పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఖిలావనపర్తిలోని ప్రభుత్వ భూములను సర్వే చేసి శనివారం వరకు నివేదిక అందించాలని, అనంతరం బొమ్మరెడ్డిపల్లిలో ప్రభుత్వ భూముల సర్వే ప్రారంభించాల ఆదేశించారు. మండలంలోని కోర్టు కేసులు, ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కోరారు.

ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ఇతర మౌలిక వసతులు ఉండేలా చూడాలని, లేకుంటే అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు. ఏపీఎం కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించడానికి గుర్తించిన భూమిని పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు. ఆయన వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, ధర్మారం మండల తహసీల్దార్ మొహమ్మద్ ఆరిఫ్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, మండల పంచాయతీ అధికారి రమేష్, ఏపీఎం తులసీ మాత, ఏపీఓ రవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story